- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి వచ్చేస్తోన్న మోగ్లీ.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే..
ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ హీరో, హీరోయిన్లుగా..

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల తనయుడు రోషన్ కనకాలల, సాక్షి మదోల్కర్ హీరో, హీరోయిన్లుగా వచ్చిన సినిమా మోగ్లీ. నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 13న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కానీ.. రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి సినిమా వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ పార్ట్నర్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ఈటీవీ విన్ ప్రకటించింది. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 వ తేదీన ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు రానున్నట్లు చిత్ర యూనిట్, ఈటీవీ విన్ ప్రకటించాయి. మోగ్లీ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటించగా.. వైవా హర్ష, కృష్ణ భగవాన్, మౌనిక రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది.






