- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు
రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ఓటీటీలోకి రావాలంటే సంక్రాంతి పండుగ రావాల్సిందే. ఈటీవీ విన్ లో సంక్రాంతి కానుకగా ఈ మూవీని

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు సక్సెస్ అవుతుంటే మరికొన్ని సినిమాలు, అడపాదడపా ఆడుతున్నాయి. ఇక మరికొన్ని సినిమాలు థియేటర్ లో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం అదరగొడుతున్నాయి. చిన్న సినిమాలకు ఈ ఓటీటీలు ఊపిరి పోస్తున్నాయి. ఇక ప్రతి వారం ఓటీటీలలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో రష్మిక మందాన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. ఈ సినిమా నవంబర్ ఏడో తేదీన రిలీజ్ అయి, మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా నెలరోజుల లోపే ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్ 5వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అటు రవితేజ, శ్రీ లీల నటించిన మాస్ జాతర ఇప్పటికే ఓటీటీలో రన్ అవుతోంది. థియేటర్ లో కంటే ఓటీటీలో ఈ సినిమాకు మంచి మైలేజ్ వస్తోంది. ఈ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది.
రాజ్ తరుణ్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ పాంచ్ మినార్. ఈ సినిమా నవంబర్ 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయి, ఓటీటీలోకి కూడా వచ్చింది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. ఆర్యన్ సినిమాతో ఇటీవల విష్ణు విశాల్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రవీణ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. పైన పేర్కొన్న సినిమాలు తప్ప, ఈ వారం పెద్ద హీరోల సినిమాలు కనిపించడం లేదు. ఇక రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ఓటీటీలోకి రావాలంటే సంక్రాంతి పండుగ రావాల్సిందే. ఈటీవీ విన్ లో సంక్రాంతి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.






