బాక్సాఫీస్ వద్ద జూన్ జాతర.. రిలీజ్‌కు సిద్ధమైన బడా సినిమాలు!

by Chukka Sudharani |

జూన్ నెలలో బాక్సాఫీస్ వద్ద బడా సినిమాలు పోటీ పడుతున్నాయి.

బాక్సాఫీస్ వద్ద జూన్ జాతర.. రిలీజ్‌కు సిద్ధమైన బడా సినిమాలు!
X

దిశ, సినిమా: సమ్మర్‌ను టార్గెట్‌గా చేసుకుని బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోరుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే జూన్ నెలలో థియేటర్స్‌లో సందడి చేయడానికి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు తెలుగు సినిమాలు రాబోతున్నాయి. అవేంటంటే?

పెద్ది: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘పెద్ది’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ 3 గంటల 9 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్‌తో సెన్సార్ పూర్తి చేసుకుని జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్‌తో ఇప్పటికే సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొనగా.. పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

సింగ్ గీతం: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి రూపొందిస్తున్న చిత్రం ‘సింగ్ గీతం’. 94 ఏళ్ల వయసులో లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు మ్యూజిక్ చేయబోతున్న ఈ సినిమాలో అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉన్నా ఈ చిత్రం జూన్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది.

మా ఇంటి బంగారం: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో.. తన సొంత బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. ‘ఓ బేబీ’ తర్వాత నందిని రెడ్డి, సమంత కలయికలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 15న రావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల చేత వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 19న హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది.

బాలన్ ది బాయ్: ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే మలయాళ సినిమాతో ఇండియా వైడ్‌గా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ చిదంబరం దర్శకత్వంలో రాబోతున్న సరికొత్త సినిమా ‘బాలన్ ది బాయ్’. కేవీఎన్ ప్రొడక్షన్స్ తెస్పియన్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మనందరికీ బాగా కనెక్ట్ అయ్యే ఒక చక్కటి నేటివిటీ కథతో, మనసును హత్తుకునే బలమైన సెంటిమెంట్, ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రేజీ మూవీని జూన్ 19, 2026 న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతున్నది.

లెనిన్: అక్కినేని అఖిల్ హీరోగా, యువ దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు కలయికలో వస్తున్న చిత్రం ‘లెనిన్’. అఖిల్ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఆశలు పెట్టుకున్నారు. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఎన్నో వాయిదాల తర్వాత ఫైనల్‌గా ‘లెనిన్’ చిత్రం జూన్ 26న విడుదల కాబోతున్నది. ఇక రీసెంట్‌గా ‘ఈ లెనిన్ గాడు నిప్పు..’ అంటూ వచ్చిన టీజర్ సైతం సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేసింది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది.

Next Story