- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
World Cancer Day : క్యాన్సర్ ను జయించిన సినీ స్టార్స్
ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే(World Cancer Day). క్యాన్సర్ మహమ్మారి ఎవరినీ కనికరించదు.

దిశ, వెబ్ డెస్క్ : ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే(World Cancer Day). క్యాన్సర్ మహమ్మారి ఎవరినీ కనికరించదు. ఆడ మగ, చిన్నా పెద్దా, పేద ధనిక లాంటి బేధాలు దానికి ఉండవు. తొలి దశలో గుర్తించడం చాలా కష్టమే అయినప్పటికీ.. అసాధ్యం మాత్రం కాదు. ఆరోగ్యం మీద శ్రద్ధ కలిగి ఉంటే తొలి దశలోనే దీనిని గుర్తించి చికిత్స చేయించడం ద్వారా చాలా వరకు మరణాలను ఆపవచ్చు. ఇది వ్యక్తిని శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా బలహీనులను చేస్తుంది. చికిత్స పరంగా, మానసికంగా ఎదుర్కోలేక ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా కొన్ని లక్షల మంది క్యాన్సర్ తో చనిపోతున్నారు. అయితే ఇంత ప్రమాదకరమైన వ్యాధిపై యుద్ధం చేసి విజయం సాధించిన సినీ స్టార్స్ గురించి తెలుసుకుందాం.
మమతా మోహన్‌దాస్(Mamatha Moahan Das): తెలుగు, మళయాళ, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన మమతా మోహన్‌దాస్ 2009లో హాడ్జికిన్స్ లింఫోమా(Hodgkin's lymphoma)తో బాధపడుతున్నట్టు ప్రకటించింది. దీంతో దాదాపుగా 10 ఏళ్ళ పాటు సినీ పరిశ్రమకి దూరంగా ఉంటూ చికిత్స తీసుకుని జయించింది.
హంసా నందిని(Hamsa Nandini): పలు సినిమాల్లో స్పెషల్స్ సాంగ్స్ చేసి కొన్ని టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించిన హంసా నందినికి 2021లో 3వ గ్రేడ్ ఇన్వేసివ్ కార్సినోమా(Breast Cancer) ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే చికిత్స తీసుకొని క్యాన్సర్ ని జయించింది.
హీనా ఖాన్(Heena Khan) : నటి హీనా ఖాన్ ప్రస్తుతం మూడవ దశ రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతోంది. ఆమె ప్రతిరోజూ తన అభిమానులతో తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ పంచుకుంటూనే ఉంది.
చావి మిట్టల్(Chavi Mittal) : పాపులర్ టీవీ నటి చావి మిట్టల్ కూడా 2022 సంవత్సరంలో రొమ్ము క్యాన్సర్‌తో బాధపడింది. తరువాత ఆమె ఈ వ్యాధిపై పోరాటంలో విజయం సాధించింది.
మహిమా చౌదరి(Mahima Chowdary) : నటి మహిమా చౌదరి కూడా 2022 సంవత్సరంలో రొమ్ము క్యాన్సర్‌తో బాధపడింది. ఆ తరువాత, చికిత్స చేయించుకుని కోలుకుంది.
మనీషా కొయిరాలా(Maneesha Koirala) : మనీషాకు 2012 లో అండాశయ క్యాన్సర్(Ovarian Cancer) ఉన్నట్లు నిర్ధారణ అయింది. చాలా ఏళ్ల చికిత్స తర్వాత ఆమె కోలుకుంది.
సోనాలి బింద్రే(Sonali Bindrey) : బాలీవుడ్ నటి సోనాలి బింద్రే కూడా 2018 సంవత్సరంలో స్టేజ్ 4 మెటాస్టాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. న్యూయార్క్‌లో చికిత్స తీసుకొని, క్యాన్సర్ నుంచి బయట పడింది.
ముంతాజ్(Muntaj) : 60-70ల నాటి ప్రముఖ నటి, ముంతాజ్ 50 సంవత్సరాల వయసులో క్యాన్సర్‌తో పోరాడింది. రొమ్ము క్యాన్సర్ పై పోరాటంలో విజయం సాధించి, ప్రస్తుతం లండన్‌లో హాయిగా జీవిస్తోంది.
సంజయ్ దత్(Sanjay Duth): 2020 లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఫస్ట్ స్టేజీలోనే ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సులభంగానే సంజయ్ క్యాన్సర్ ని జయించాడు.
రాకేష్ రోషన్(Rakesh Roshan): బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాకేష్ రోషన్ గొంతు క్యాన్సర్ తో బాధ పడ్డాడు. ఇనీషియల్ స్టేజ్ లోనే గుర్తించడంతో ఖరీదైన చికిత్సలు తీసుకుని క్యాన్సర్ ని జయించాడు.
Read Also..
హలో బ్రదర్స్.. మందు తాగేటప్పుడు స్టఫ్‌గా అవి తింటున్నారా?.. టూ డేంజరస్






