- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్ హీరోతో మూవీ సెట్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు టైగర్ ష్రాఫ్‌తో సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిర్మాణ సంస్థల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. ఈ బ్యానర్ తక్కువ కాలంలోనే అనేక చిత్రాలను నిర్మించి ప్రత్యేక గుర్తింపును పొందింది. అయితే నిర్మించిన సినిమాల్లో విజయాల శాతం మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఇటీవల ఈ సంస్థ నిర్మించిన ‘రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ తేజ సజ్జ హీరోగా ‘మిరాయ్ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
అలాగే త్వరలోనే ‘జాంబీ రెడ్డి 2’ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కోసం ఓ కథను సిద్ధం చేసి, ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. టైగర్ ష్రాఫ్ కూడా ఈ బ్యానర్‌లో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని అంశాలు అనుకూలిస్తే ఈ క్రేజీ బాలీవుడ్ హీరోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.






