- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాఘవ లారెన్స్ ‘బెంజ్’ మూవీలో కోలీవుడ్ స్టార్ కీ రోల్.. పోస్ట్‌తో కన్ఫర్మ్ చేసిన లోకేష్ కనగరాజ్
ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు లోకేష్ కనగరాజ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశారు.

దిశ, సినిమా: రాఘవ లారెన్స్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఆయన నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రాల్లో ‘బెంజ్’ ఒకటి. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కథను అందించిన ఈ సినిమాకు బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. అందరినీ ఆకట్టుకునే విషయం ఏంటంటే.. ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతోంది. ఇందులో మాలీవుడ్ స్టార్ హీరో నివిన్ పౌలీ ఒక కీలక పాత్రలో కనిపించనుండగా.. లారెన్స్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు జి స్క్వాడ్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు లోకేష్ కనగరాజ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఆయన ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలుపుతూ, ‘బెంజ్’ యూనివర్స్‌లోకి ఘనంగా స్వాగతం పలికారు. అంతేకాకుండా ‘బెంజ్’ ప్రపంచానికి మరింత శక్తి తోడవుతుందంటూ రాసుకొచ్చారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఎల్‌సీయూకి సంబంధించిన బలమైన కనెక్షన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా లోకేష్ గత చిత్రాలైన ‘ఖైదీ’, ‘లియో’ సినిమాలకు సంబంధించిన కొన్ని లింకులు, ప్రస్తావనలు ఈ ‘బెంజ్’ సినిమాలో చూపించబోతున్నారట. దీనివల్ల ఈ కథ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌తో మరింత బలంగా ముడిపడనుందని టాక్.






