‘పాంచ్‌మినార్’ టీజర్ అప్డేట్ ఇచ్చిన చిత్రబృందం.. క్యూరియాసిటీ పెంచుతున్న హీరో,హీరోయిన్ పోస్టర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-12 06:39:44  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో వచ్చి అందరినీ మెప్పించాడు.

‘పాంచ్‌మినార్’ టీజర్ అప్డేట్ ఇచ్చిన చిత్రబృందం.. క్యూరియాసిటీ పెంచుతున్న హీరో,హీరోయిన్ పోస్టర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో వచ్చి అందరినీ మెప్పించాడు. ఇక ఆ తర్వాత కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మావా, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇక గత ఏడాది కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) కీలక పాత్రలో నటించి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత రాజ్ తరుణ్ తిరబడరసామి, భలే ఉన్నాడే, పురుషోత్తముడు వంటి మూవీస్ చేశారు. కానీ ఒక్కటి కూడా విజయం సాధించలేక బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయాయి. ఈక్రమంలోనే.. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి ఆయనపై కేసు పెట్టడంతో అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు కోర్టు వరకు వెళ్లడంతో పాటు లావణ్య పలు సంచలన విషయాలు బయటపెట్టడం ఈ ఘటన నెట్టింట దుమారం రేపింది.

దీంతో నిత్యం రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. ఒక కోర్టు మాత్రం ఆయనకు ఊరటను ఇవ్వడంతో అంతా సర్దుమనగనట్లు అయింది. ఇక కొద్ది రోజుల పాటు అన్నింటికీ దూరంగా ఉన్న ఆయన మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ‘పాంచ్‌మినార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్ కుడుముల(Ram Kudumula) దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఈ ఏడాది విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను గోవింద రాజు ప్రజెంట్ చేస్తుండగా.. కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్‌పై మాధవి, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అజయ్ ఘోష్(Ajay Ghosh), బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

దీనికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా, హనుమాన్ జయంతి సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ ఇచ్చారు. రేపు ఏప్రిల్ 13న సాయంత్రం 3:33 గంటలకు ‘పాంచ్‌ మినార్’ టీజర్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అలాగే హీరో, హీరోయిన్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘‘ మునుపెన్నడూ లేని విధంగా కామెడీ, గందరగోళం, థ్రిల్‌లను ఇస్తుంది. రేపు విడుదలయ్యే ఈ టీజర్‌తో ఉల్లాసాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక పోస్టర్‌లో కారులో కూర్చుని ఉన్న రాజ్ తరుణ్, రాశి షాక్ అవుతూ ఉండి తమ లుక్‌తో.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు.

Next Story