Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి డబుల్ అప్డేట్స్.. తుఫానుకు కౌంట్‌డౌన్ మొదలైందంటూ మూవీ మేకర్స్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-07 14:36:46  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు(Harihara Veeramallu), ఉస్తాద్ భగత్‌సింగ్(Ustad Bhagat Singh), ఓజీ వంటి భారీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు.

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి డబుల్ అప్డేట్స్.. తుఫానుకు కౌంట్‌డౌన్ మొదలైందంటూ మూవీ మేకర్స్ ట్వీట్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు(Harihara Veeramallu), ఉస్తాద్ భగత్‌సింగ్(Ustad Bhagat Singh), ఓజీ వంటి భారీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు. ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌ కూడా 50 శాతం వరకు పూర్తి చేశారు. కానీ ఈ క్రమంలోనే ఎన్నికల్లో గెలవడంతో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. దీంతో షూటింగ్ పూర్తి కానందున పలు చిత్రాలు వాయిదా పడుతున్నాయి. అయితే పవన్ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తాయా ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా రాబోతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

క్రిష్ జాగర్లమూడి కొంత భాగాన్ని పూర్తి చేయగా.. మిగిలిన మొత్తాన్ని జ్యోతి కృష్ణ కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, బాబీ డియోల్(Bobby Deol), అనసూయ, పూజా పొన్నాడ(Pooja Ponnada), నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ప్రేక్షకులు హరిహరి వీరమల్లు అప్డేట్స్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ డబుల్ అప్డేట్స్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన షూటింగ్‌ ఇంకా రెండు రోజులే ఉంది. దీంతో ‘హరిహర వీరమల్లు’ స్మారక ప్రయాణం గొప్పగా ముగుస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎక్స్‌ప్లోజివ్ ట్రైలర్ కోసం సిద్ధంగా ఉండండి. పాటలు అతి త్వరలో మీ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు తుఫాను కౌంట్‌డౌన్ ప్రారంభమైంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story