Bumper offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత .. పట్టుకుంటే ఐదు లక్షలు ఇస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

గత కొద్ది రోజుల నుంచి మూవీ మేకర్స్ థియేటర్స్‌లోకి జనాలను రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

Bumper offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత .. పట్టుకుంటే ఐదు లక్షలు ఇస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి మూవీ మేకర్స్ థియేటర్స్‌లోకి జనాలను రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వారిని ఆకర్షించేందుకు ప్రమోషన్స్ వెరైటీగా చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి మరీ ప్రమోషన్స్ చేసినప్పటికీ కొన్ని సినిమాలకు నిరాశ తప్పడం లేదు. కరోనా పోయినప్పటి నుంచి జనాలు ఓటీటీల్లోనే చూస్తున్నారు. దీంతో థియేటర్స్‌కు కూడా పోకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయి. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా వచ్చినప్పటికీ ప్రేక్షకులు సినిమాలను చూసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. మరి కొన్ని అయితే దారుణంగా విడుదలైన రోజే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

ఈ క్రమంలో.. తాజాగా, ‘ఎర్రచీర’ చిత్రబృందం ఆడియన్స్‌కు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. అయితే ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) మనవరాలు బేబీ సాయి తేజస్విని(Sai Tejaswini) ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం ‘ఎర్రచీర: ది బిగినింగ్' (Erra Cheera)అనేది ట్యాగ్ లైన్. సుమన్ బాబు (Suman Babu)స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో కీలక పాత్రను పోషించారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా 25 ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమాను వేసవి కానుకగా మే రెండో వారంలో విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాత సుమన్ బాబు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘’ఈ నెల 25న రిలీజ్ కావాల్సిన ఎర్రచీర కొన్ని టెక్నికల్ కారణాలతో వాయిదా పడింది. మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉంటుంది. కామెడీ, హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కలగలిపి ఎక్కడా బోర్ కొట్టకుండా సిద్ధం చేసుకున్నాం. సినిమా చూసి బయటకు వెళ్లే ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుని బయటికి వెళ్తారు అని చెప్పగలను. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి అభినందించారు. భలే సినిమా చేశారని అన్నారు. ఈ సినిమాకి ఒక కాంటెస్ట్ అనౌన్స్ చేస్తున్నాం. సినిమా కథ కరెక్టుగా రిలీజ్ కి ముందు గెస్ చేస్తే ఐదు లక్షలు ప్రైజ్ మనీ ఇస్తాం. 8019246552 నంబర్ కి కరెక్ట్ కథ చెప్పినవారికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది’’ అని అన్నారు.

Next Story