సినిమా హిట్ టాక్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో, హీరోయిన్.. ఫొటో వైరల్

by Gugulothu.Kavitha |

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్‌(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

సినిమా హిట్ టాక్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో, హీరోయిన్.. ఫొటో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్‌(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆయన ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) మూవీతో మన ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక దీనికి సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహించగా.. ఇందులో సంయుక్తా మీనన్‌(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటించారు.

విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కించారు. ఇక సినిమా మంచి విజయం సాధించడంతో తాజాగా తిరుమల పుణ్యక్షేత్రంలో హీరో శర్వానంద్‌, హీరోయిన్ సాక్షి వైద్య సందడి చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో వీరిద్దరూ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఆలయానికి చేరుకున్న సినీ బృందానికి టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం పలుకగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story