- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్‌లో మూవీ!
‘బంగార్రాజు’ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్నది.

X
దిశ, సినిమా: యువ సామ్రాట్ నాగ చైతన్య త్వరలో ‘వృషకర్మ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల ‘తండేల్’తో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత నాగచైతన్య నుంచి వస్తున్న ఈ భారీ చిత్రంపై అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘వృషకర్మ’తో పాటు చైతు చేతిలో పలు ప్రాజెక్టులో ఉండగా.. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా ఓకే చేసినట్లు టాక్. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా ‘బంగార్రాజు’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో నాగచైతన్యతో పాటు నాగార్జున కూడా నటించాడు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి స్క్రీన్‌పైకి రాబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Next Story






