- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Megastar: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర తిరగరాసిన గుకేశ్‌పై సినీ సెలబ్రిటీలు పొగడ్తల వర్షం
భారత చెస్ మాస్టర్ గుకేశ్(Gukesh) చరిత్ర సృష్టించాడు.

దిశ, వెబ్‌డెస్క్: భారత చెస్ మాస్టర్ గుకేశ్(Gukesh) చరిత్ర సృష్టించాడు. చైనా(China)కు చెందిన డింగ్ లిరెన్(Ding Liren) ను ఓడించి.. అతిపిన్న వయస్సులో గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్(Championship) టైటిల్ గెలుచుకున్నాడు. 18 ఏళ్లకే అరుదైన ఘనత సాధించడంతో సినీ ప్రముఖులంతా గుకేశ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ.. అభినందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గుకేశ్ గురించి ట్విట్టర్ వేదికన రాసుకొస్తూ.. వావ్.. జస్ట్ వావ్.. భారత చెస్ మాస్టర్ గుకేశ్(Gukesh) చరిత్ర సృష్టించాడు.నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది డియర్ గుకేశ్. ఇదొక అద్భుతమైన ఫీట్. భారతదేశం(India) మిమ్మల్ని చూసి గర్విస్తోంది. 18 సంవత్సరాల వయస్సులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్(World Chess Champion). చరిత్రలో 2వ భారతీయుడిగా ఈ ఘనత సాధించావు. అన్నింటికంటే పిన్న వయస్కుడిగా ప్రపంచ ఛాంపియన్‌గా మారావు. మేరా భారత్ మహాన్(Mera Bharat Mahan). అంటూ మెగాస్టార్ చిరంజీవి గుకేశ్ ను కొనియాడారు. ఈ నటుడితో పాటు కమల్ హాసన్(Kamal Haasan), ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కూడా గుకేశ్ ను సోషల్ మీడియా వేదికన అభినందించారు.






