- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్
టాలీవుడ్ నటుడు శివాజీ మహిళల వస్త్రాధరణపై చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సామాన్లు అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడి మహిళలను కించపర్చడంతో పాటు స్టేజిపైనే శివాజీ దుర్భాషలాడారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు శివాజీ మహిళల వస్త్రాధరణపై చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సామాన్లు అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడి మహిళలను కించపర్చడంతో పాటు స్టేజిపైనే శివాజీ దుర్భాషలాడారు. శివాజీ మహిళలు చీరకట్టులోనే అందంగా ఉంటారని చెప్పిన వ్యాఖ్యలను కొందరు సమర్దించగా మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ అంశంపై స్పందించింది. దండోరా సినిమా ఈవెంట్ లో శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెప్పారని తెలిపింది.
హీరోయిన్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశానని శివాజీ వివరణ ఇచ్చినట్టు పేర్కొంది. తన ఉద్దేశం మంచిదేనని కానీ తాను వాడిన భాష సరికాదని ఒప్పుకున్నాడని.. దానికి శిలాజీ క్షమాపణలు చెప్పారని తెలిపింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరింది. ఇక శివాజీ క్షమాపణలు చెబుతూ ఇచ్చిన వివరణను మా అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మరోవైపు తెలంగాణ మహిళా కమిషన్ సైతం విచారణకు హాజరుకావాలంటూ శివాజీకి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.






