భైరవం ఈవెంట్‌లో సందడి చేసిన మౌనిక.. మనోజ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

భైరవం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా సందడి సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముగ్గురు హీరోలు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ సందడి చేశారు.

భైరవం ఈవెంట్‌లో సందడి చేసిన మౌనిక.. మనోజ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: భైరవం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా సందడి సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముగ్గురు హీరోలు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ సందడి చేశారు. ఇక మనోజ్ భార్య మౌనిక కూడా కార్యక్రమానికి వచ్చారు. కాగా సుమ మనోజ్ భార్య మౌనికను కొన్ని ప్రశ్నలు సరదాగా అడగ్గా ఆమె సమాధానాలు ఇచ్చారు. భైరవం సినిమాపై మీ అంచనాలు ఏంటి అని సుమ అడగ్గా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు.

మనోజ్ పాత్ర గురించి ఏం చెబుతారు అని ప్రశ్నించగా గణపతి పాత్రలో అద్భతంగా నటించాడని అన్నారు. అంతే కాకుండా మనోజ్‌కు ఏదైనా ఒకే పదాన్ని డెడికేట్ చేయాలి అని చెప్పగా.. ఫై హై ఉన్నత శిఖరాలను అదిరోహించు అంటూ సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే మనోజ్ భూమా మౌనికను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరికి సంతానం కూడా కలిగింది. ఇద్దరికీ మొదట వేరే వివాహాలు అవ్వగా విడాకులు తీసుకున్నారు. తరవాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

Next Story