Mouni Roy: స్టార్ హీరో సినిమాలో చాన్స్.. నా జీవితకాలం కల నెరవేరుతుందని మౌని రాయ్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్(Mouni Roy) సీరియల్స్ ద్వారా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

Mouni Roy: స్టార్ హీరో సినిమాలో చాన్స్.. నా జీవితకాలం కల నెరవేరుతుందని మౌని రాయ్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్(Mouni Roy) సీరియల్స్ ద్వారా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా నాగిన్ లోని శివన్యా, శివాంగీ పాత్రలు చేసి విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. వేద, లండర్ కాన్ఫిడెన్షల్, బ్లాక్ అవుట్ వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఇటీవల మౌనీరాయ్ ‘భూత్నీ’(Bhootni) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిధాంత్ సచ్‌దేవ్(Sidhanth Sachdev) దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ సినిమా మే1న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మౌనీరాయ్ ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan), పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘హే జవానీ తో ఇష్క్ హోనా హే’ సినిమాలో మౌనీరాయ్ కీలక పాత్రలో నటించనుంది.

ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)..., మనీషా పాల్ ఈ మూవీలో కనిపించనుబోతున్నారు. అయితే ఈ సినిమాకు డేవిడ్ ధావన్(David Dhawan) దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ విషయంపై మౌనీరాయ్ ఎమోషనల్ అయింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టింది. ‘‘మీలో ఎవరికైనా మ్యాజిక్ & కల నిజమవుతుందనే సిద్ధాంతం అర్థమైతే ఇదే. డేవిడ్ సర్ తో పనిచేయడం నా జీవితకాల కల. ఆయన సినిమాలు చేయడం అత్యుత్తమ అనుభవం. వరుణ్ ధావన్ నేను పనిచేసిన అత్యంత శ్రద్ధగల, కష్టపడి పనిచేసే, ప్రేమించే, అందమైన, సూపర్ స్టార్.

ఇక పూజా హెగ్డే మీరు అందంగా ఉన్నారు. నేను నటించలేని సన్నివేశానికి నిన్న మీరు నాకు ఇచ్చిన మద్దతును నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు అద్భుతాలు చేయడాన్ని చూడాలనుకుంటున్నాను దానికి అర్హులు. ఫర్హాద్ సర్ ఈ చిత్రంలో దయగల వ్యక్తిగా మరియు నాకు అత్యంత సహాయం చేసినందుకు ధన్యవాదాలు మీరు ఉత్తముడు. నా ప్రియమైన మృణాల్ మీరు చాలా తెలివైనవారు నాకు మాటలు రావడం లేదు. నిన్ను మొదటిసారి కలిసినప్పుడే నాకు తెలుసు. నా అద్భుతమైన అందమైన బేబీ. అలాగే ఉండు. కష్టపడి పని చేస్తూ ఉండు, ఆకాశమే హద్దు. చివరిది కానీ తక్కువ కాదు. ఇప్పుడు నేను షూట్ పూర్తి చేసాను’’ అని రాసుకొచ్చింది.

Next Story