- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కథ చెబుతానని ముద్దు పెట్టుకున్నాడు.. డైరెక్టర్‌పై మౌని రాయ్ కామెంట్స్
నాగిని సీరియల్‌తో భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది నటి మౌనీ రాయ్.

దిశ, సినిమా: నాగిని సీరియల్‌తో భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది నటి మౌనీ రాయ్. ఇప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ మెప్పిస్తుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తనకు ఎదురైన ఓ దారుణ అనుభవాన్ని పంచుకుంది. ‘నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సినిమా ఆఫర్ల కోసం ముంబైకి వెళ్లాను. అక్కడ ఓ డైరెక్టర్ నాకు కథ చెబుతానని పిలిచి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ సంఘటన నన్ను చాలా కాలం వెంటాడింది. అలా ఎన్నో కష్టాలు, ఒత్తిడి, ట్రోలింగ్స్ ఎదుర్కొని ఈ రోజు ఈ స్టేజ్‌లో నిలబడ్డాను’ అని తెలిపింది. అయితే ఆ డైరెక్టర్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. కాగా.. మౌనీ రాయ్ బాలీవుడ్‌లో ప్రసిద్ధ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే KGF సినిమాలోని ఒక పాటతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఈ బ్యూటీ.. సినిమాలు, సీరియల్స్, స్పెషల్ సాంగ్స్‌తో పాటు ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది.
- Tags
- Mouni Roy






