Mouni Roy: ఫేస్ సర్జరీతో అందవికారంగా తయారైన హీరోయిన్.. వాళ్లకు అదే ఆనందం అంటూ కామెంట్స్

by Chukka Sudharani |

బుల్లితెరపై సీరియల్స్‌తో ఎంట్రీ ఇచ్చి.. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy)

Mouni Roy: ఫేస్ సర్జరీతో అందవికారంగా తయారైన హీరోయిన్.. వాళ్లకు అదే ఆనందం అంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: బుల్లితెరపై సీరియల్స్‌తో ఎంట్రీ ఇచ్చి.. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy). నాగిని సీరియల్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. వెండితెరపై కూడా సందడి చేస్తుంది. మెయిన్ రోల్స్‌తో పాటు సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మౌనీ రాయ్‌పై సోషల్ మీడియా(Social media)లో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ హీరోయిన్ మరింత అందంగా మారడం కోసం ఫేస్‌కి సర్జరీ చేయించుకుని.. అంద వీకారంగా తయారైందని, ఈమె ఏంటీ ఇలా అయిపోయింది అంటూ మౌనీ రాయ్‌కు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.

ఇందులో భాగంగా.. తనపై వస్తున్న ట్రోల్స్‌(Trolls)పై తాజాగా స్పందించింది ఈ బ్యూటీ. ‘నాపై కామెంట్స్ చేసేవాళ్లు నాకు కనిపించరు. కాబట్టి వాళ్ల మాటలకు నేను బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. వారి మాట‌ల‌ని నేను పెద్దగా ప‌ట్టించుకోను కూడా. ఎందుకంటే ఎదుటి వాళ్లను ట్రోల్స్ చేస్తూ ఆనందం పొందాల‌ని అనుకున్నవాళ్లని మ‌నం ఏం చేయ‌లేము. ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారిని జీవించ‌నివ్వండి.. వాళ్లకే అదే ఆనందం.. ఎవరి సంతోషం వారిది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. త్వరలో మౌనీ రాయ్ ‘ది భూత్నీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ఈవెంట్‌లో పాల్గొనగా.. అప్పటి నుంచి ఈమెపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి.

Next Story