- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vishvambhara: ఫైనల్లీ విశ్వంభరలో ఆ బ్యూటీ ఫిక్స్.. చిరుతో డ్యాన్స్ చేస్తున్న వీడియో పంచుకున్న నటి
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లాస్ట్ షెడ్యూల్‌లో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ చేస్తున్నారు. అయితే.. మొన్నటి వరకు ఈ స్పెషల్ సాంగ్ మౌనీరాయ్ చిరు పక్కన స్టెప్పులు వేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు దీనిపై చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. తాజాగా ఈ వార్తలపై ఓ క్లారిటీ వచ్చింది. సెట్స్‌లో జరుగుతోన్న వీడియోలతో పాటు చిరుతో, మూవీ యూనిట్‌తో దిగిన పలు ఫొటోలను మౌనీ రాయ్ తన ఇన్‌స్టావేదికగా పంచుకుంది. ఇందులో తను స్పెషల్ సాంగ్‌లో నటిస్తున్న అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఓ నోట్ షేర్ చేసింది.
‘మెగాస్టార్ చిరంజీవి సర్ గత కొన్ని రోజులుగా మీ పక్కన డ్యాన్స్ చేయడం ఎంత గౌరవంగా భావిస్తున్నాను. మీరు ఓ దిగ్గజ నటుడు అలాగే మంచి వ్యక్తి. మీరు నాపై చూపించిన ఆప్యాయత, గౌరవానికి, మీ బిర్యానీకి ధన్యవాదాలు. ఈ అద్భుతమైన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. లవ్ యూ సర్. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్‌జీ ఈ నెలలో మీతో కలిసి పనిచేయడం, మీ నుండి డ్యాన్స్ నేర్చుకోవడం ఎంత అదృష్టమో. మీరు చాలా ఉత్తములు. మీ నైపుణ్యాన్ని చూసి ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతాను. చిత్ర బృందానికి ధన్యవాదాలు. త్వరలో కలుద్దాం.. మీతో కలిసి ‘విశ్వంభర’ చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా’ అంటూ తెలిపింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. లింక్






