Bad Girls: బ్యాడ్ గర్ల్స్.. కానీ చాలా మంచోళ్లు

by Chukka Sudharani |

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ డైరెక్టర్ మున్నా ధులిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎగ్జైటెడ్ మూవీ ‘బ్యాడ్ గర్ల్స్’.

Bad Girls: బ్యాడ్ గర్ల్స్.. కానీ చాలా మంచోళ్లు
X

దిశ, సినిమా: ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ డైరెక్టర్ మున్నా ధులిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎగ్జైటెడ్ మూవీ ‘బ్యాడ్ గర్ల్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానకి.. ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చెయ్యగా.. ఈ ఈవెంట్‌కు దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని.. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.

Next Story