- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bollywood : తల్లి, కొడుకులు కాస్త భార్యాభర్తలయ్యారుగా!
చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడం కొత్తేమీ కాదు.

దిశ, వెబ్ డెస్క్ : చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడం కొత్తేమీ కాదు. కలిసి పనిచేసే సందర్భంలో స్నేహం పెరగడం.. ఆ తర్వాత ప్రేమలో పడటం.. చివరకు అది పెళ్లి వరకు వెళ్లడం తరచూ జరిగే విషయం. బాలీవుడ్ నుంచీ టాలీవుడ్ వరకు ఎన్నో ప్రేమకథలు, ప్రేమవివాహాలు మనం చూసాం. అంతే కాకుండా ప్రేమ పెళ్లిళ్లు ఈ మధ్య వరుసగా విడాకుల బాట పట్టడం కూడా చూస్తున్నాం. కానీ కొన్ని ప్రేమకథలు మాత్రం ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ తరహా లవ్ స్టోరీ లలో ప్రముఖ నటి కిష్వర్ మర్చంట్(Kishwar Merchant) అలానే నటుడు సుయాష్ రాయ్(Suyyash Roy)లది. ఈ జంట ఓ టీవి సీరియల్‌లో తల్లి-కొడుకు పాత్రల్లో నటించగా.. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి, చివరికి భార్యాభర్తలుగా మారారు.
వీరిద్దరూ ప్రేమలో పడిన తర్వాత కిష్వర్ తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడంతో.. మొదట సుయాష్ కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కాబోయే కోడలు పెద్దదని వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ ప్రేమకు ఏది అడ్డు కాదని నిరూపిస్తూ తల్లిదండ్రులను ఒప్పించి.. 2016లో ఇద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వారి పెళ్లి తర్వాత కూడా ఈ జంట ట్రోలింగ్ కి గురైంది. వారి మధ్య వయస్సును ఉద్దేశించి కొంతమంది సోషల్ మీడియాల్లో విమర్శలు చేశారు. కానీ ఆ కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా వారిద్దరూ అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 2021లో వీరిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు.






