- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మోస్ట్ వైలెంట్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే ..?
ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసూలు చేసింది

దిశ, వెబ్ డెస్క్ : మలయాళంలో ‘మార్కో’ ( Marco ) మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసూలు చేసింది. మలయాళంలో మోస్ట్ వైలెంట్ గా విడుదల అయి సూపర్ హిట్ గా నిలిచింది. మలయాళంలో ఇలాంటి సినిమాని ఇంత వరకు వచ్చింది లేదు.. ఇది కూడా ఒక రకంగా కలిసి వచ్చింది.
మార్కో చిత్రం తెలుగులో జనవరి 1న విడుదల కాగా , ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. షరీఫ్ మొహమ్మద్ నిర్మాణంలో హనీఫ్ అదేని డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. సిద్దిఖ్, జగదీశ్, ఇషాన్, యుక్తి తరేజా, కబీర్ సింగ్ వంటి నటీ నటులు ముఖ్య పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు. ఇప్పుడు, ఈ మూవీ తెలుగు డబ్బింగ్ ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించింది.
ఓవర్సీస్ లో " ఆహా " ఓటీటీలో ఈ నెల 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. దీనిలో మనుషులను చంపే కొన్ని వైలెంట్ సీన్స్ చాలానే ఉన్నాయి. మరి, మీకు అలాంటి సీన్స్ చూసే ధైర్యం మార్కోని తెలుగులో ఈ ఫిబ్రవరి 21 న ఆహాలో చూసేయండి.






