- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వావ్.. అదిరిపోయే లుక్‌లో మెస్మరైజ్ చేస్తోన్న కుంభమేళా బ్యూటీ.. ఆకట్టుకుంటోన్న లేటెస్ట్ లుక్

దిశ, వెబ్‌డెస్క్: నీలి కళ్ల అందంతో సోషల్ మీడియాలోని జనాలందర్ని మెస్మరైజ్ చేస్తోంది మోనాలిసా. కుంభమేళా పుణ్యమా అంటూ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. ఈమె మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అమ్మాయి. మోనాలిసా ఓవర్ నైట్ ఫుల్ ఫేమ్ అవ్వడంతో ఈమెను చూడానికి చాలా మంది అక్కడకు వెళ్లారు. తనతో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు.
దీంతో మహాకుంభమేళాలో పూసల దండలు అమ్ముకున్న ఈ అమ్మాయికి బాలీవుడ్ దర్శకుడు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. తన అమాయకత్వం, కాటుక దిద్దిన తేనె కళ్లు దీనికి కారణమని చెప్పుకోవచ్చు. మోనాలిసా రూపం, తన అమాయకత్వం చూసి ఫిదా అయ్యానని కూడా దర్శకుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన మూవీ కోసం మోనాలిసా లాంటి అమ్మాయినే వెతుకున్నానంటూ పేర్కొన్నారు. ఈ దర్శకుడు అనుకున్న పాత్రకు మోనాలిసా కరెక్ట్‌గా సెట్ అవుతుందని ఆయన వెల్లడించారు.
త్వరలో ఈ బ్యూటీ సనోజ్ మిశ్రా దర్శకత్వం వహిస్తోన్న ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో కనిపించనుంది. మోనాలిసాకు బాబీ చెమ్మనూర్ ఓ డైమండ్ నెక్లెస్ బహుమతి కూడా ఇచ్చాడు. ఇకపోతే ఈ ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ప్రసిద్ధి చెందిన మోనాలిసా భోంస్లే, తన తాజా వైరల్ వీడియోలలో ఉత్కంఠభరితమైన మేకోవర్‌తో అద్భుతంగా కనిపించింది. మోనాలిసా లేటెస్ట్ లుక్ వీక్షించిన జనాలు ఫిదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.