- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Monalisa: తేనె కళ్ల సుందరి మోనాలిసాకు సినిమా ఆఫర్ ప్రకటించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayag Raj)లో జరుగుతున్న మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ జీవిస్తూ.. తన అందంతో అందరినీ కట్టి పడేసిన మోనాలిసా(Monalisa) గురించి అందరికీ తెలిసిందే.

దిశ, సినిమా: ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayag Raj)లో జరుగుతున్న మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ జీవిస్తూ.. తన అందంతో అందరినీ కట్టి పడేసిన మోనాలిసా(Monalisa) గురించి అందరికీ తెలిసిందే. తేనె కళ్లు.. అమాయకపు చూపులు.. అంతకు మించి ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియా క్వీన్‌గా మారిపోయింది. పెద్ద ఎత్తున ఈమె వీడియోలు వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఈమెకు సినిమాలో చాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. యాక్టింగ్ రాకపోతే నేర్పించి మరీ తన సినిమాలో పెట్టుకుంటానని చెప్పారు. వివరాల్లోకి వెళితే..
కుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన మోనాలిసాకు అదృష్టం తలుపుతట్టింది. తన సినిమాలో చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఏకంగా స్టార్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా(Sanoj Mishra) తెలిపారు. అలాగే త్వరలోనే ఆమెను(మోనాలిసా) కలుస్తానన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మోనాలిసా భోస్లే.. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ఇండోర్(Indore)కు చెందిన అమ్మాయి. అయితే తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఈమె తన తమ్ముడిని చదివించేందుకు ఈ పని చేస్తున్నట్లు తెలిపింది. కొన్నేళ్లు బాగానే చదువుకున్న ఆమె.. కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఏర్పడగా.. తమ్ముడి కోసం చదువుకు దూరం కావాల్సి వచ్చిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది మోనాలిసా.






