- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mohanlal: బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తున్న మోహన్‌లాల్ ‘తుడరుమ్’ సినిమా.. మైలురాయిని చేరుకున్నామంటూ ట్వీట్
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohanlal) వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఇక ఇటీవల మోహన్‌లాల్ ‘ఎల్-2: ఎంపురాన్’(L-2: Empuran) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా మార్చి 27న థియేటర్స్‌లో విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టింది. అలాగే బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత మోహన్‌లాల్ కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ‘తుడరుమ్’ (Thudarum)చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు. తరుణ్ మూర్తి(Tarun Murthy) దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో శోభన, ప్రకాష్ వర్మ, ఫర్హాన్ షాసిల్, మణియంపిల్ల రాజు వంటి వారు కీలక పాత్రలో కనిపించాడు.
అయితే ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్‌లోకి వచ్చి ఘన విజయం సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేశారు మేకర్స్. తమిళంలోనే కాకుండా ‘తుడరుమ్’ తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా, ఈ సినిమా ఓ మైలురాయిని చేరుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మోహన్‌లాల్ ట్వీట్ చేశారు. కేవలం కేరళ బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్లు వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా ‘తుడరుమ్’ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. దీంతో మోహన్‌లాల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘‘మనమంతా కలిసి ఈ మైలురాయిని చేరుకున్నాం’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.






