‘సూర్య-45’ లో మోహన్ లాల్.. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తామంటున్న దర్శకుడు

by Mallepaka Hamsa |

ప్రస్తుతానికి సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు లేదా అప్‌డేట్‌లు ఇవ్వడానికి ఇంకా సరైన సమయం రాలేదు.

‘సూర్య-45’ లో మోహన్ లాల్.. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తామంటున్న దర్శకుడు
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల ‘కరుప్పు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆయన తదుపరి చిత్రాలైన సూర్య 48, సూర్య 49, సూర్య 50 ప్రాజెక్ట్‌ల కథా చర్చల్లో కూడా పాల్గొంటున్నారు. దర్శకులతో మాట్లాడుతూ పట్టాలెక్కించే ప్రయత్నాల్లో బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సూర్య 47వ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆవేశం’ ఫేమ్ జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జాగారం స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో నస్లెన్, స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు జీతు మాధవన్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "ప్రస్తుతానికి సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు లేదా అప్‌డేట్‌లు ఇవ్వడానికి ఇంకా సరైన సమయం రాలేదు. ప్రస్తుతం షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఇంకా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. మరో కొన్ని రోజుల్లో ఈ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సరైన సమయం చూసుకుని మేమే అన్ని వివరాలను అధికారికంగా వెల్లడిస్తాము" అని చెప్పారు. సినిమా పోస్టర్లు, మోహన్‌లాల్ నటిస్తున్నారనే రూమర్లపై స్పందిస్తూ.. "ఇప్పటివరకు మేము ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పోస్టర్‌ను కూడా విడుదల చేయలేదు. కాబట్టి అప్పుడే అంచనాలకు రావద్దు, ముందు అప్‌డేట్‌లు రానివ్వండి. జూలైలో హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అలాగే ఈ సినిమాలో లాలెట్టన్ మోహన్‌లాల్ నటిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, ఆయన ఈ ప్రాజెక్ట్‌లో లేరు" అని జీతు మాధవన్ స్పష్టం చేశారు.

Next Story