శ్రీకాంత్ ఓదెల మూవీలో విలన్ గా కలెక్షన్ కింగ్.. మరి ఏ హీరో సినిమాలో?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-03 23:04:01  IST  )

తెలుగు సినిమా రంగంలో దర్శకుడిగా విశేషమైన గుర్తింపు పొందిన శ్రీకాంత్ ఓదెల, తన తాజా ప్రాజెక్టులతో మరోసారి సంచలనం సృష్టిస్తున్నాడు.

శ్రీకాంత్ ఓదెల మూవీలో విలన్ గా కలెక్షన్ కింగ్.. మరి ఏ హీరో సినిమాలో?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా రంగంలో దర్శకుడిగా విశేషమైన గుర్తింపు పొందిన శ్రీకాంత్ ఓదెల, తన తాజా ప్రాజెక్టులతో మరోసారి సంచలనం సృష్టిస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న రెండు సినిమాల్లోని ఒక సినిమాలో కలెక్షన కింగ్ మోహన్ బాబు విలన్ గా నటించనున్నట్లు సమాచారం. ఇందుకాయన ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో ది ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో సినిమా ఇది. తొలి సినిమా దసరా.. బాక్సాఫీస్ వద్ద రూ.135 కోట్ల వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైస్’ ఒక యాక్షన్-ప్యాక్డ్ డ్రామా, ఇది గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రంలో నాని ప్రధాన పాత్రలో నటిస్తుండగా, విలన్ క్యారెక్టర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నాని స్వయంగా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

‘ది ప్యారడైస్’ రూ. 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. 2024లో షూటింగ్ ప్రారంభమవ్వగా.. 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

దీని తర్వాత చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల 157వ సినిమాను తీయనున్నారు. ఈరెండింటిలో ఒక సినిమాలో మాత్రం మోహన్ బాబు విలన్ గా కనిపించనున్నట్లు టాక్. ఇదెంతవరకూ నిజమో, ఏ సినిమాలో ఆయన విలన్ గా కనిపిస్తాడో తెలియాలంటే మూవీ టీమ్ స్పందించేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

Next Story