మోహన్ లాల్‌కు మాతృ వియోగం

by Sujitha Rachapalli |   (  Updated:2025-12-30 10:46:13  IST  )

మలయాళ సూపర్‌ స్టార్ మోహన్ లాల్ తల్లి శాంత కుమారి తుది శ్వాస విడిచారు. కొచ్చిలోని ఎలమక్కరలోని మోహన్ లాల్ ఇంట్లో చనిపోయారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. కాగా చాలా కాలంగా న్యూరాలజికల్ సమస్యలు, స్ట్రోక్,

మోహన్ లాల్‌కు మాతృ వియోగం
X

దిశ, సినిమా : మలయాళ సూపర్‌ స్టార్ మోహన్ లాల్ తల్లి శాంత కుమారి తుది శ్వాస విడిచారు. కొచ్చిలో ఉన్న ఎలమక్కరలోని మోహన్ లాల్ ఇంట్లో చనిపోయారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. కాగా చాలా కాలంగా న్యూరాలజికల్ సమస్యలు, స్ట్రోక్, పారాలిసిస్ వంటి వయసు సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. శాంత కుమారి గారెకి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు ప్యారిలాల్ 2000లో మరణించారు. మోహన్ లాల్ తన తల్లిని చాలా గౌరవంగా చూడటమే కాదు తన విజయాలకు ఆమెనే ప్రధాన కారణంగా చెప్తుంటారు. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు కూడా మొదట ఆమె దగ్గరకే వెళ్లి ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. కాగా ఆమె అంతిమ యాత్ర రేపు తిరువనంతపురంలో జరగనుంది. కాగా శాంత కుమారి మృతిపై ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.

Next Story