- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mohan Babu: ఆకలితో వచ్చిన కోపం అది.. మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్ వైరల్
మంచు విష్ణు డీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

దిశ, సినిమా: మంచు విష్ణు డీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇందులో యాక్ట్ చేస్తూ నిర్మాతగా వ్యవహిరిస్తున్న మంచు మోహన్ బాబు (Mohan Babu).. తాజాగా ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో పాల్గొని జీవితంపై తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘నేను కూడా ఒకప్పుడు.. హే ఇప్పుడు నా సినిమా సూపర్ హిట్.. నెక్ట్స్ సినిమా కూడా సూపర్ హిట్ అనేవాడిని. కానీ ప్లాప్ అయ్యేవి. ఎందుకంటే విజయం మన చేతిలో ఉండదు. మనం సిన్సియర్‌గా కష్టపడ్డామా.. డీసెంట్‌గా, డిసిప్లేన్‌గా ఉన్నామా అనేదే ముఖ్యం. అలా 1975 నవంబర్ 22 నా మొదటి చిత్రం రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత 500కు పైగా సినిమాల్లో నటించాను. 70 సినిమాలకు నిర్మాతా ఉన్నాను. అయితే.. నేను చాలా ముక్కుసూటి మనిషిని.
అలాగే నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది. అది మీ అందరికి తెలుసు. అదే నా వీక్‌నెస్. అందరికి ఏదో ఒక వీక్‌నెస్ ఉంటుంది. అందరూ కోపం తెచ్చుకుంటారు. నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అయితే.. ఆకలితో వచ్చిన కోపం అది అప్పట్లో. ఆ విధంగా జీవితంలో ఎంతో కష్టపడ్డాం. ఫుడ్ కూడా లేదు. అలా మద్రాస్‌లో కష్టపడి సంపాదించి ఆ భగవంతుని ఆశీస్సులతో విద్యాలయాలు, మోహన్ బాబు యూనివర్సిటీలు, 25% ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాం. అలాగే క్యాస్ట్ అనేదాన్ని కూడా ఏ రోజు లెక్కచెయ్యలేదు. అలా ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ మా మీద ఉన్నాయి’ అని చెప్పుకొచ్చాడు.






