- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mohan Babu: ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను.. మోహన్ బాబు ట్వీట్ వైరల్
దిగ్గజ నటులు రజనీకాంత్, డాక్టర్ ఎం. మోహన్ బాబు కలిసి నటించిన ‘పెద రాయుడు’ చిత్రం (జూన్ 15, 1995) విడదలై ముప్పై ఏళ్లు అవుతోంది.

దిశ, సినిమా : దిగ్గజ నటులు రజనీకాంత్, డాక్టర్ ఎం. మోహన్ బాబు కలిసి నటించిన ‘పెద రాయుడు’ చిత్రం (జూన్ 15, 1995) విడదలై ముప్పై ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలో వీరిద్దరూ కలుసుకుని నాటి జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నారు. ఇందులో భాగంగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కన్నప్ప’ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పారట రజినీకాంత్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ మోహన్ బాబు, విష్ణు స్పెషల్ ట్వీట్ పెట్టారు.
మోహన్ బాబు: ‘జూన్ 15కి ‘పెద రాయుడు’ రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తయ్యాయి. అదే రోజు నా ప్రియ మిత్రుడు రజినీకాంత్ ‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించారు. ఆయన తన ఫ్యామిలీతో సహా మూవీని వీక్షించారు. సినిమా చూసిన తరువాత ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను. థాంక్యూ మిత్రమా’ అని అన్నారు. విష్ణు స్పందిస్తూ.. ‘సినిమా చూశాక రజినీకాంత్ అంకుల్ టైట్ హగ్ ఇచ్చాడు. నాకు కన్నప్ప చాలా నచ్చిందని చెప్పి.. ఈ క్షణం కోసం 22 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానని అన్నారు. అలాగే గర్వంగా ఉంది.. జూన్ 27 కోసం వెయిట్ చేయలేకపోతున్నానని.. వెండి తెరపై శివుడి మ్యాజిక్ ఫీల్ అయ్యేందుకు ఈగర్‌గా ఉందని రజినీ అంకుల్ చెప్పారు’ అని తెలిపాడు. కాగా.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.






