- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెదిరించి మరీ ఆయనతో పని చేయించుకున్న మోహన్ బాబు.. ఇప్పటికి బయటపడిన అసలు విషయం
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ… నటుడు మోహన్ బాబు కెరీర్ ప్రారంభ దశలో తనను సరదాగా బెదిరిస్తూ తన సినిమాలకు పాటలు రాయించాడని చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఏ విషయం అయినా నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. దాంతో ఆయన పలుమార్లు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న మోహన్ బాబు గురించి గొప్పగా చెప్పే వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఒకరు. తాజాగా సుద్దాల అశోక్ తేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
మోహన్ బాబుతో తనకున్న అనుబంధం చాలా గొప్పదని, కెరీర్ తొలినాళ్లలో ఆయన స్నేహబంధం తనకు ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. బయట కొంతమంది మోహన్ బాబును నెగటివ్‌గా చూస్తుంటారని, కానీ ఆయన నిజానికి చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. తాను గేయ రచయితగా కెరీర్ ప్రారంభించిన రోజుల్లో ఎక్కువగా దాసరి నారాయణరావు గారి చిత్రాలకు పాటలు రాసేవాడినని, ఆ సినిమాల వల్ల తనకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. అలాంటి సమయంలో మోహన్ బాబు తనను ప్రత్యేకంగా ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు.
ఒకసారి మోహన్ బాబు ఫోన్ చేసి — “ఏం సుద్దాల అశోక్ తేజ, నువ్వు కేవలం మా గురువుగారి సినిమాలకు మాత్రమే పాటలు రాస్తావా? మా సినిమాలకు రాయవా? ఆయన సినిమాకు పాటలు రాస్తే నువ్వు ఇంటికి వెళ్లి గుడ్లు పెట్టాల్సి వస్తోంది. అదే నా సినిమాకు పాటలు రాస్తే నీకు ఫుడ్డు దొరుకుతుంది. ఇకనుంచి మా సినిమాలకు కూడా పాటలు రాయండి… మీకు నెలకు కొన్ని పాటలు వస్తూనే ఉంటాయి” — అంటూ సరదాగా చెప్పారని తెలిపారు. అలా మోహన్ బాబు తనను ప్రోత్సహించి, తన జీవితం ముందుకు సాగడంలో ఎంతో సహాయపడ్డారని సుద్దాల అశోక్ తేజ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






