మంచు ఫ్యామిలీలో చిచ్చు పెడుతున్న వీడియో.. విష్ణుకు 7వేల ఎకరాల భూమి కొన్న మోహన్ బాబు.. (వైరల్ వీడియో లింక్)

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-22 08:26:59  IST  )

మంచు ఫ్యామిలీలో గొడవలు రోడ్డు ఎక్కాయి. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి తనను మోసం చేస్తున్నారని.. మంచు మనోజ్ గొడవకు దిగాడు. ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టాడు. అరెస్టులు, ఫిర్యాదులు, కోర్టుల చుట్టూ తిరగడాలు అయిపోయాయి.

మంచు ఫ్యామిలీలో చిచ్చు పెడుతున్న వీడియో.. విష్ణుకు 7వేల ఎకరాల భూమి కొన్న మోహన్ బాబు.. (వైరల్ వీడియో లింక్)
X

దిశ, వెబ్‌డెస్క్ : మంచు ఫ్యామిలీలో గొడవలు రోడ్డు ఎక్కాయి. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి తనను మోసం చేస్తున్నారని.. మంచు మనోజ్ గొడవకు దిగాడు. ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టాడు. అరెస్టులు, ఫిర్యాదులు, కోర్టుల చుట్టూ తిరగడాలు అయిపోయాయి. ప్రస్తుతం అందరూ ప్రశాంతంగానే ఉన్నారు. అటు మనోజ్ భైరవంతో హిట్ అందుకుంటే.. ఇటు కన్నప్ప సక్సెస్ కోసం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు విష్ణు. ఇలాంటి టైమ్‌లో ఓ వీడియో మరోసారి చిచ్చుపెట్టేలా ఉంది.

కన్నప్ప సినిమా షూటింగ్ కోసం యూనిట్ మొత్తం న్యూజిలాండ్‌లో స్టే చేసింది. మూవీలో చాలా భాగం అక్కడే షూట్ చేశారు. ఈ క్రమంలో షూటింగ్ పూర్తయ్యాక అక్కడి నేచర్‌ను ఆస్వాదిస్తున్న మోహన్ బాబు, విష్ణు ఓ ఫన్నీ వీడియో తీశారు. ఇందులో ఇదంతా మనదే అంటూ ఆ ల్యాండ్‌ను చూపిస్తూ ఫన్నీ కామెంట్స్ చేశాడు కలెక్షన్ కింగ్. న్యూజిలాండ్‌లో ఏడు వేల ఎకరాలు కొన్నా.. ఇదంతా విష్ణు వర్ధన్ బాబుకే అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభుదేవా లోపలి నుంచి మోహన్ బాబు దగ్గరికి రాగానే ఇదంతా ప్రభు దేవాకే అంటూ నవ్వేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇదంతా జస్ట్ కామెడీ కోసమని కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇంత ఎలా కూడబెట్టార్రా బాబు, మరి మంచు మనోజ్ సంగతేంది... అని ఇంకొందరు అడుగుతున్నారు.

VIDEO


Next Story