గుజరాత్ సీఎంతో హీరో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ.. ఆ విషయంపై మీటింగ్

by Chukka Sudharani |

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ (Kannappa)సినిమా భారీ ఎత్తున రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

గుజరాత్ సీఎంతో హీరో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ.. ఆ విషయంపై మీటింగ్
X

దిశ, సినిమా: విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ (Kannappa)సినిమా భారీ ఎత్తున రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ (24 Frame Factory) బ్యానర్స్‌పై మోహన్ బాబు (Mohan Babu) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి.. ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లు, ఫస్ట్ లుక్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్‌గా పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)పోస్టర్ రిలీజ్ చేయగా.. త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) లుక్ రివీల్ చేయనున్నట్లు ఇప్పటికే అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. దీంతో సినిమాపై రోజురోజుకు భారీగా హైప్ క్రియేట్ అవుతోంది.

కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉండటంతో.. లెజెండరీ నటుడు మోహన్ బాబు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషనల్ టూర్‌లో భాగంగా కన్నప్ప టీమ్ దేశవ్యాప్తంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శిస్తోంది. ఈ క్రమంలో మోహన్ బాబు, విష్ణు మంచు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌(CM Bhupendra Patel)ను కలిశారు. ఈ టూర్‌లో శరత్ కుమార్(Sharath Kumar), ముఖేష్ రిషి (Mukesh Rishi), వినయ్ మహేశ్వరి(Vinay Maheshwari) కూడా సందడి చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అతిథి మర్యాదలకు, సాదర స్వాగతాలకు కన్నప్ప టీం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ప్రముఖ తెలుగు కళాకారుడు రమేష్ గొరిజాల (Ramesh Gorijala) అందమైన పెయింటింగ్‌ను విష్ణు మంచు ముఖ్యమంత్రికి బహుకరించారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story