హీరోల డ్రగ్స్ టెస్ట్‌పై ఎమ్మెల్యే డిమాండ్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు

by Kema Shiva Kumar |

హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు విడుదల చేయాలన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలకు మంచు విష్ణు ఘాటుగా బదులిచ్చారు.

హీరోల డ్రగ్స్ టెస్ట్‌పై ఎమ్మెల్యే డిమాండ్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు
X

దిశ, వెబ్‌డెస్క్: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. సినిమాల విడుదలకు ముందు హీరోలు డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని, నెగటివ్ వస్తనే వారి మూవీని థియేటర్లలో విడుదల చేయాలన్న వ్యాఖ్యలపై తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా విడుదలకు ముందు తాము డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటామని అన్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు పోటీలో నిలబడే ప్రజాప్రతినిధులు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలని ప్రశ్నించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే వారు, ప్రజలను పాలించే ఎమ్మెల్యేలు కూడా పారదర్శకంగా ఉండాలని, కేవలం సినిమా రంగాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని విష్ణు పరోక్షంగా హితవు పలికారు.

కాగా, కొంతకాలంగా టాలీవుడ్‌ (Tollywood)ను డ్రగ్స్ అంశం వెంటాడుతున్న తరుణంలో, ఓ ఎమ్మెల్యే నేరుగా సినిమా విడుదలతో దీనిని ముడిపెట్టడం చర్చనీయాంశమైంది. అందుకు మంచు విష్ణు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా రంగానికి మద్దతుగా విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story