- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mithila Palkar: కొంటె చూపులతో కట్టిపడేస్తున్న యంగ్ బ్యూటీ
మిథాలీ పాల్కర్ తాజాగా టైట్ మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మిథాలీ పాల్కర్ 1993 జనవరి 11న ఒక మరాఠీ కుటుంబంలో జన్మించింది. చిన్నతనంలో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి వసాయిలో నివసించింది. అయితే అక్కడ ఎదురైన కొన్ని అసౌకర్యాల కారణంగా ఆమె కుటుంబం దాదర్‌కు మారింది.
ఆమె కుటుంబంలో ఇంతకు ముందు ఎవరూ సినిమా లేదా నటన రంగానికి చెందినవారు లేరు. అయినప్పటికీ మిథాలీకి చిన్నప్పటినుంచే నటనపై ఆసక్తి ఉండేది. ఈ రంగంలోకి వెళ్లాలనే తన నిర్ణయాన్ని మొదట తాతగారు అంగీకరించలేదు.
కానీ తరువాత ఆమె ప్రయత్నాలను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఆమెకు మద్దతు ఇచ్చారు. మిథాలీ పాల్కర్ మరాఠీ సినిమాల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అనంతరం ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి గుర్తింపు పొందింది. తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ఓరి దేవుడా’ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగులో మరే సినిమాలోనూ కనిపించలేదు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా మిథాలీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులతో తరచూ అప్డేట్లు పంచుకుంటూ ఉంటుంది.
ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో టైట్ మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె లుక్‌కు తగ్గట్టుగా ధరించిన ఇయర్ రింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జుట్టును అందంగా వెనక్కు దువ్వి ఇచ్చిన స్టైలిష్ పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






