మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఆలోచింపజేసే చిత్రం..

by Sujitha Rachapalli |

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో చేస్తున్న హైలీ ఎంటర్టైనర్ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఆలోచింపజేసే చిత్రం..
X

దిశ, సినిమా : త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో చేస్తున్న హైలీ ఎంటర్టైనర్ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. అరుణ్ చిలువేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా టీజర్ గ్రాండ్ గా లాంచ్ చేశారు.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ఈ వేడుకకి విచ్చేసిన అతిధులు అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి .అందరికి ఒక హోప్ వచ్చింది. సినిమాలు చూడడం థియేటర్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. బాబ్జి గారికి థాంక్యూ తక్కువ టికెట్ ధరల్లో పెడితే ఆడియన్స్ అందరూ వచ్చి చూస్తారని భావిస్తున్నాను. మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పాం. మనమందరం కూడా వ్యవసాయం నుంచే వచ్చాము. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తరాలు కూడా వ్యవసాయం నుంచే వచ్చాయి. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. నేను ఈ ఇండస్ట్రీలో ఉండడానికి కారణం చంటి గారు. ఆయన లేకపోతే ఈ జర్నీ ఇంత స్మూత్ గా జరిగేది కాదు. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చినప్పుడు విన్న ఒక మాట నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. వ్యవసాయ భూమి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుందంటే.. వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలి.. ఈ ఆలోచనతో చేసిన కథ. ఇది చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ హత్తుకునేలా వుంటుంది. హీరో త్రిగుణ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది మాది. 5 ఏళ్ల జర్నీ. మొదటి రోజు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాము. బాబ్జి గారు చాలా మంచి మనిషి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు మీ మొహం లో చిరునవ్వు ఎక్కడికి పోదు. ఈ సినిమా ఆనందంపజేస్తుంది, ఆలోచింపచేస్తుంది. సినిమా చూసిన తర్వాత అందరూ కూడా చిరునవ్వుతో బయటకు వస్తారు.

Next Story