- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఫుల్ ఖుషిలో తెలుగు ఆడియన్స్
హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’.

దిశ, సినిమా: హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’. క్రిస్టోఫర్ మేక్‌క్వారీ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మే 23న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే ఇది మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజీలో తెరకెక్కిన చివరి భాగం కావడంతో.. ప్రేక్షకులు ఎగబడి మరి థియేటర్స్‌లో చూడటంతో.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన లేటెస్ట్ చిత్రంగా నిలిచింది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు అమోజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ సొంతం చేసుకోగా.. తాజాగా స్ట్రీమింగ్ డేట్‌పై అప్డేటే వచ్చింది. ఈ సినిమా ఆగష్టు 19 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఇక తెలుగులో కూడా ఇది అందుబాటులోకి వస్తుండటంతో ఆడియన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






