- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mission Impossible: రిలీజ్‌కు సిద్ధమైన ‘మిషన్ ఇంపాజిబుల్- ఫైనల్ రెకనింగ్’.. అనుకున్న దానికంటే ముందే ప్రక్షకుల ముందుకు
హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ (Tom Cruise) నటించిన లేటెస్ట్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్- ఫైనల్ రెకనింగ్’

దిశ, సినిమా: హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ (Tom Cruise) నటించిన లేటెస్ట్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్- ఫైనల్ రెకనింగ్’ (Mission Impossible - Final Reckoning). క్రిస్టోఫర్ మేక్‌క్వారీ (Christopher McQuarrie) దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కోసం సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా విడుదల తేదీని మార్చుతూ.. కొత్త రిలీజ్ డేట్(Release date)ను ప్రకటించింది. నిజానికి మిషన్ ఇంపాజిబుల్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. మే 23న విడుదల కాబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్.
కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానుల కోసం.. అలాగే వారి డిమాండ్(demand)ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అనుకున్న దానికంటే ముందుగానే రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు మూవీ యూనిట్. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఓ పోస్టర్(Poster)ను రిలీజ్ చేశారు. అనుకున్న దానికంటే ఆరు రోజులు ముందుగానే అంటే మే 17న ఇంగ్లీష్ (English), హిందీ (Hindi), తమిళం (Tamil), తెలుగు (Telugu) భాషల్లో ‘మిషన్ ఇంపాజిబుల్- ఫైనల్ రెకనింగ్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






