- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mirai: సూపర్ హీరో కోసం యాక్షన్ ప్రిన్స్.. మిరాయ్ నుంచి మరో అప్డేట్
తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ‘మిరాయ్’ సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతున్నది.

దిశ, సినిమా: తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ‘మిరాయ్’ సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతున్నది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచి ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా ఓ పోస్టర్‌తో పాటు తేజా వీడియో రిలీజ్ చేశారు. ‘నమస్కార బెంగళూరు.. సూపర్ హీరో తేజా సజ్జా రేపు సాయంత్రం 5 గంటల నుండి ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో జరిగే మిరాయ్ కన్నడ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొననున్నాడు. దీనికి ముఖ్య అతిధిగా కన్నడ స్టార్ యాక్షన్ ప్రిన్స్ దృవ సజ్జా హాజరు కానున్నారు. దీనికి మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.. మిరాయ్ సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. కర్ణాటకలో ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్, వీకే ఫిలిమ్స్ రిలీజ్ చేస్తున్నాయి’ అని తెలిపారు. కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తు ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతున్నది. లింక్






