Ritika Nayak: అసలు ఎవరూ ఈ యంగ్ బ్యూటీ.. మిరాయ్ హీరోయిన్ అందానికి ఫిదా అవుతున్న యూత్

by Chukka Sudharani |

యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’.

Ritika Nayak: అసలు ఎవరూ ఈ యంగ్ బ్యూటీ.. మిరాయ్ హీరోయిన్ అందానికి ఫిదా అవుతున్న యూత్
X

దిశ, సినిమా: యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. ఈ యాక్షన్ అడ్వెంచర్‌కు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో తేజ సజ్జా సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో పాటు.. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించగా ప్రేక్షకుల చూపు మిరాయ్ చిత్రంపై పడింది. ఇక ఈ మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధం అయింది.

ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది యంగ్ బ్యూటీ రితికా నాయక్. దీంతో ప్రజెంట్ యూత్ చూపు రితికాపై పడింది. అయితే.. ఈ బ్యూటీకి ‘మిరాయ్’ మొదటి చిత్రం కాదు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అంతే కాదు.. నేచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ మూవీలో లాస్ట్‌లో నాని కూతురుగా స్టేజ్‌పై సాంగ్ పాడింది కూడా ఈ బ్యూటీనే. ఇక మిరాయ్ చిత్రం రిలీజ్ కాకుండానే ఫుల్ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది ఈ రితికా. దీంతో సోషల్ మీడియాలో ఆమె గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు యూత్. ఇక వరుస పెట్టి తన ఫొటోలకు లైకులు కొడుతూ మరింత క్రేజ్ పెంచుతున్నారు. ప్రజెంట్ ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. లింక్


Next Story