- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మిరాయ్ 2’పై బిగ్ అప్డేట్.. 10 రోజులు షూటింగ్ అక్కడే?
తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిరాయ్ 2’ షూటింగ్ అప్డేట్ వచ్చింది.

దిశ, సినిమా: ‘హనుమాన్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌తో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ నటుడు తేజా సజ్జా.. ‘మిరాయ్’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎండింగ్‌లోనే సీక్వెల్ ఉన్నట్లు టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ‘మిరాయ్ 2’ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సీక్వెల్ షూటింగ్ వైజాగ్‌లో ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వగా 10 రోజులు జరగనుందట. అయితే ఇది సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కాదు. కేవలం ఈ మూవీలోని అత్యంత కీలకమైన, భారీ వీఎఫ్‌ఎక్స్ బ్లాక్స్ కోసం అవసరమైన బ్లూ, గ్రీన్ మ్యాన్ షాట్స్, బ్యాక్ గ్రౌండ్ ప్లేట్స్, గ్రాఫిక్స్ ప్రిపరేషన్ షాట్స్‌ను మాత్రమే చిత్రీకరిస్తున్నారట. ఈ 10 రోజుల షూటింగ్‌లో వీఎఫ్ఎక్స్ బ్లాక్స్ షూట్ ముగిసిన వెంటనే ఆ ఫుటేజ్‌ను గ్రాఫిక్స్ స్టూడియోలకు పంపించేస్తారు’ అని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం.






