థ్రిల్లింగ్ ట్విస్టులతో ‘మరీచిక’ ట్రైలర్

by Chukka Sudharani |

రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మరీచిక’ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

థ్రిల్లింగ్ ట్విస్టులతో ‘మరీచిక’ ట్రైలర్
X

దిశ, సినిమా: రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మరీచిక’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తెరకెక్కిస్తున్న ఈ సరికొత్త థ్రిల్లర్ మూవీ నుంచి తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్‌ను గమనించినట్లు అయితే.. ఇందులో వెంకట లక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించారు. సంజు పాత్రలో విరాజ్ అశ్విన్, మరీచిక పాత్రలో రెజీనా కసాండ్రా కనిపించి మెప్పించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు, కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఇలా ఇందులో పరిచయం చేసిన ప్రతీ పాత్ర సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఎమోషనల్, థ్రిల్లింగ్ ట్విస్టులు టర్నులతో సినిమా ఉండనుందని ట్రైలర్‌తో తెలుస్తోంది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మిస్తున్న ఈ చిత్రం మే 29న భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది.

Next Story