- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీఎంట్రీ ఇచ్చిన బంగారం బ్యూటీ.. కానీ హీరోయిన్‌గా కాదు
Meera Chopra : విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన 'గాంధీ టాక్స్' అనే తమిళ చిత్రం ద్వారా మీరా చోప్రా నిర్మాతగా సినీ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా నటించిన తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మీరా చోప్రా ఒకరు. ఈ ముద్దుగుమ్మ 'వాన' అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో కెరీర్‌ను కొనసాగిస్తున్న సమయంలో ఎం. ఎస్. రాజు నిర్మించిన చిత్రం కావడంతో 'వాన' మూవీపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
కానీ ఈ సినిమాలోని మీరా చోప్రా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో ఆ వెంటనే ఈమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'బంగారం' చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ ముద్దుగుమ్మ బ్యాడ్ లక్, ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ ఈమె వేరే భాషల సినిమాల్లో నటిస్తూ చాలా కాలం మంచి దశలోనే కెరీర్‌ను కొనసాగించింది. కానీ గత కొన్నేళ్లుగా ఈమె ఏ సినిమాలో నటించడం లేదు.
ప్రస్తుతం ఈమె వయసు 42 సంవత్సరాలు. ఈ వయసులో ఈమె మళ్లీ సినీ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు, నిర్మాతగా ఇచ్చింది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన 'గాంధీ టాక్స్' అనే తమిళ చిత్రాన్ని నటి మీరా చోప్రా నిర్మించారు. ఈ సినిమా జనవరి 30వ తేదీన విడుదల అయింది. ఈమె సినిమాల్లో కూడా నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.






