- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్‌కు మూడు రాష్ట్రాల మంత్రులు.. జనసేన ఎమ్మెల్యేలు సైతం!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రం ఈనెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రం ఈనెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్ వేదికగా భారీ ప్రీరిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేసింది. ఈనెల 21వ తేదీన నగరంలోని శిల్పకళా వేదికలో ఏర్పాట్లు చేస్తు్న్నారు. అయితే.. ఈ వేడుకకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేశ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌తో పాటు డైరెక్టర్ రాజమౌళి, త్రివిక్రమ్‌లు ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలుస్తోంది. జనసేన MLAలు సైతం హాజరవుతారని సమాచారం.
తొలిసారి పవన్ కల్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు.. సినిమా ప్రేమికులంతా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలి విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. పవన్ కళ్యాణ్ గెటప్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్ అన్ని నెక్ట్స్ లెవల్ అని అభిమానులు అంటున్నారు. ట్రైలర్ విడుదల తర్వాతే అసలు మ్యాజిక్ మొదలైందన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాను, జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది.






