- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మై లవ్’.. ఘనంగా లాంచ్ చేసిన మంత్రి
సంజోష్ తగరం హర్షిత హీరో హీరోయిన్లుగా "జోష్' ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకం పై, సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతు రూపొందుతున్న నూతన చిత్రం

దిశ, సినిమా : సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతూ రూపొందుతున్న నూతన చిత్రం మై లవ్'. ఈ చిత్రానికి ఐటి మినిస్టర్ & ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్ధిల్లా శ్రీధర్ బాబు క్లాప్ కొట్టగా.. జూబ్లీహిల్స్ M.L.A నవీన్ యాదవ్ కెమెరా స్విచ్ ఆన్ yచేస్తూ ఫస్ట్ షార్ట్ కి దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా హీరో & దర్శకుడు సంజోష్ తగరం మాట్లాడుతు ఇది మంచి యూనివర్సల్ కంటెంట్ సరి కొత్తగా ఉంటుంది ఇలాంటి కంటెంట్ ఇప్పటి వరకు ఎవరు టచ్ చెయ్యని పాయింట్ తీసుకోవడం జరిగింది, నేటి యువతకు మంచి మెసేజ్ తొ పాటు. మంచి సందేశం ఉంటుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మా కుటుంబ సహకారం మరువలేనిది. ఈ చిత్రంలో మంచి సాహిత్యం విలువలతో కూడిన పాటలు అతి త్వరలో వినబోతున్నారు. దర్శకుడిగా, నటుడుగా, నాకంటూ మంచి గుర్తింపు వస్తుంది అని అన్నారు.
ఈ సందర్బంగా నిర్మాత శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. మంచి కథ మంచి కథనంతొ రూపొందుతున్న చిత్రం ఇది తప్పకుండ అన్ని వర్గాల వారికి నచ్చుతుంది అన్నారు. హీరోయిన్ హర్షిత మాట్లాడుతూ సంజోష్ నాకు చెప్పిన పాయింట్ చాలా కొత్తగా వుంది. ఈ చిత్రంతో మంచి నటిగా పేరు వస్తుందని చెప్పారు. కొరియాగ్రాఫర్ రవి క్రిష్ణ మాట్లాడుతూ చాలా రోజుల తరువాత మంచి సాహిత్యం విలువలతో కూడిన పాటలకు కొరియోగ్రాఫి చేయబోతునందుకు చాలా ఆనందంగా వుంది. నా కేరియర్ లో ది బెస్ట్ చిత్రం గా నిలుస్తుంది అన్నారు. ఈ చిత్రానికి సింగల్ కార్డు. కోరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చిన సంజోస్ గారికి రుణపడి ఉంటానని చెప్పారు.






