పవన్ కల్యాణ్ సినిమాను అడ్డుకుంటున్న ‘ఆ నలుగురు’?.. విచారణకు ఆదేశించిన మంత్రి

by Gantepaka Srikanth |

తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసి వేస్తున్నట్లు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్ సినిమాను అడ్డుకుంటున్న ‘ఆ నలుగురు’?.. విచారణకు ఆదేశించిన మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసి వేస్తున్నట్లు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమా హరిహర వీరమల్లు విడుదల వేళ.. కావాలనే ఓ నలుగురు నిర్మాతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. అందులో భాగంగా వ్యూహాత్మకంగా థియేటర్లు మూసివేయించారని వార్తలు విస్తృతం అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్(Kandula Durgesh) స్పందించారు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు.

హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ పరిణామంతోపాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్‌గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించీ విచారణ చేయాలని దుర్గేష్ స్పష్టం చేశారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలోనూ వివరాలు సేకరించబోతున్నారు.

Next Story