Tamannaah: బ్యూటిపుల్ వీడియో పంచుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా

by Kodari Anjali |   (  Updated:2025-05-21 15:26:33  IST  )

టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Tamannaah: బ్యూటిపుల్ వీడియో పంచుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఎందరో అగ్ర హీరోలతో జతకట్టి.. అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది మిల్క్ బ్యూటీ. హ్యాపీడేస్, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, ఊసరవెల్లి, బద్రీనాథ్, రెబెల్, కెమెరామెన్ గంగతో, బాహుబలి, తడాఖా, బెంగాల్ టైగర్, సైరా నరసింహారెడ్డి, భోళా శంకర్, జైలర్, స్త్రీ-2, ఓదెల2 వంటి చిత్రాల్లో నటించి తన సత్తా చాటింది.

అద్భుతమైన నటన, అందం, అభినయం.. ముఖ్యంగా ఇరగదీసే డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. అంతేకాకుండా తమన్నా భాటియా ఐటెమ్ సాంగ్స్‌లో కూడా మెరిసింది. ఇక సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. చెక్కు చెదరని అందంతో ఈ మిల్క్ బ్యూటీ కుర్రాళ్ల మతిపోగుడుతుందనడంలో అతిశయోక్తిలేదు. ఇక తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మత చాలా కాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి.

పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ టాక్ వినిపించింది. కానీ ఇటీవల వీరిద్దరూ విడిపోయారంటూ మళ్లీ వార్తలు వైరల్ అయ్యాయి. మరీ ఇవన్నీ ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. తమన్నా భాటియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. అభిమానుల్ని పలకరిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పొద్దుతిరుగుడు పువ్వు చేతిలో పట్టుకుని ఓ బ్యూటిఫుల్ వీడియో పంచుకుంది. దీనికి ఇప్పుడు ఓదెల 2 చిత్రం చూస్తున్నానని ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Next Story