మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా మిల్క్ బ్యూటీ తమన్నా..

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-11 08:09:38  IST  )

మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannah) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా మిల్క్ బ్యూటీ తమన్నా..
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannah) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతికాలంలోనే ఈ ముద్దుగుమ్మ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ చిన్నది ప్రజెంట్ అడపాదడపా సినిమాలతో హీరోయిన్‌గా రాణిస్తోంది. మరోపక్క స్పెషల్ సాంగ్స్ చేస్తూ మెరుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా 'మైసూర్ శాండల్ సోప్'(Mysore Sandal Soap) బ్రాండ్‌కు కొత్త అంబాసిడర్‌గా మిల్క్ బ్యూటీ తమన్నా ఎన్నికైంది. 'కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(KSDL)' బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ తమన్నా భాటియాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఆమె రెండేళ్ల పాటు మైసూర్ శాండల్ సోప్, ఇతర ఉత్పత్తులకు అంబాసిడర్‌గా కొనసాగనున్నారు. కాగా ఈ ఒప్పంద కాలంలో ఆమె.. ఇతర ప్రైవేటు కంపెనీలకు చెందిన ఎలాంటి ఉత్పత్తులకు ప్రచారం కల్పించకూడదు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

నన్ను డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే.. రాశీ ఖన్నా పోస్ట్ వైరల్

Next Story