- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే.. రాశీ ఖన్నా పోస్ట్ వైరల్
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇటీవల ఈ చిన్నది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu Kada) మూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తోంది. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాజాగా రాశీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘నా జీవితాంతం - ప్రమాదం నుండి - రక్షించుకుంటూ వస్తున్న ఆ వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కానీ నిజంగా, నా స్థిరత్వం, నా బలం మరియు నా సురక్షితమైన ప్రదేశం నువ్వే. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’ అని రాసుకొస్తూ తన బ్రదర్స్‌తో తీసుకున్న కొన్ని ఫన్నీ ఫొటోస్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు అతని బ్రదర్‌కి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.
మీరు లేకుండా మేము ఏమీ చేయలేము.. చెన్నై సూపర్ చాంపియన్స్‌పై సమంత ఎమోషనల్ పోస్ట్






