మీరు లేకుండా మేము ఏమీ చేయలేము.. చెన్నై సూపర్ చాంపియన్స్‌పై సమంత ఎమోషనల్ పోస్ట్

by I. Sairam |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

మీరు లేకుండా మేము ఏమీ చేయలేము..  చెన్నై సూపర్ చాంపియన్స్‌పై సమంత ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇక అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడి అతన్నే మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత రీసెంట్‌గా బాలీవుడ్ దర్శకుడు రాజ్‌ నిడిమోరు(Raj Nidimoru)తో పెళ్లిపీటలెక్కింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది.

ఇక మ్యారేజ్ తర్వాత మళ్లీ తమ ప్రొఫెషనల్ వర్క్స్‌లో బిజీ అయిపోయింది సమంత. ‘శుభం’(Shubham) సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు కూడా సామ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య, దివ్యేందు కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది సామ్. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఇన్‌స్టా స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సమంత తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ స్టోరీ పెట్టింది. పిక్ బాల్ స్పోర్ట్స్ టీమ్‌తో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. మీరు లేకుండా ఇది నేను చేయలేను’ అని రాసుకొస్తూ చెన్నై సూపర్ చాంపియన్స్‌తో పాటు కర్నాటేరియా అనే వ్యక్తిని ట్యాగ్ చేసింది. దీంతో ఈ స్టోరీ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వివిధ రకరకాలుగా స్పందిస్తున్నారు.




Next Story