ఆఫీస్ వేర్‌లో మిల్క్ బ్యూటీ.. మై ఫౌండర్ ఫేస్ అంటూ పోస్ట్.. కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టనుందా..?

by Gugulothu.Kavitha |

మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannah) ‘శ్రీ’(Sri) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఆఫీస్ వేర్‌లో మిల్క్ బ్యూటీ.. మై ఫౌండర్ ఫేస్ అంటూ పోస్ట్.. కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టనుందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannah) ‘శ్రీ’(Sri) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. అయితే ఈ అమ్మడు చేసే డ్యాన్స్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఇక రీసెంట్‌గా ఈ చిన్నది తెలుగులో ‘ఓదెల-2’(Odela-2) అనే సినిమాలో నటించింది. అయితే ఈ చిత్రం అనుకున్నంతగా విజయం సాధించలేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతోంది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది.

అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో ఆఫీస్ వేర్‌లో రెడీ అయి ఫొటోస్‌కి పోజులిచ్చింది. నిజంగానే ఆఫీస్‌లో కూర్చొని ఓ వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఇక వీటికి ‘మై ఫౌండర్ ఫేస్’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు కొత్త బిజినెస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story